ప్రెస్‌మీట్‌ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ | Muslim woman takes 'divorce' at press meet in Lucknow | Sakshi
Sakshi News home page

ప్రెస్‌మీట్‌ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ

Sep 11 2017 9:07 AM | Updated on Sep 19 2017 4:22 PM

ప్రెస్‌మీట్‌ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ

ప్రెస్‌మీట్‌ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ

దేశవ్యాప్తంగా ‘తలాక్‌’వివాదంపై చర్చ నడుస్తున్న సమయంలో తాజాగా ‘ఖులా’ తెరమీదికొచ్చింది.

లక్నో: దేశవ్యాప్తంగా ‘తలాక్‌’వివాదంపై చర్చ నడుస్తున్న సమయంలో తాజాగా ‘ఖులా’ తెరమీదికొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాజదా ఖతూన్‌ అనే ముస్లిం మహిళ శనివారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తన భర్తకు ‘ఖులా’చెప్పి విడాకులు తీసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ప్రెస్‌మీట్‌లో విలేకరుల సమక్షంలో ఖులాపై సంతకం చేశారు.

జుబెర్‌ అలీతో పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత తనను హింసించడం మొదలుపెట్టాడని, ఈ విషయాన్ని ముస్లిం పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని షాజదా పేర్కొన్నారు. అందుకే తన భర్త నుంచి ‘ఖులా’(విడాకులు) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షాజదా తెలిపారు. అంతేకాకుండా ‘ఖులా’పై సంతకం చేసి నోటీసును తన భర్తకు పంపించినట్లు వెల్లడించారు. షాజదాకు ముస్లిం మహిళల లీగ్‌ ప్రధాన కార్యదర్శి నైష్‌ హసన్‌ మద్దతు ప్రకటించారు.

మరోవైపు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫరంగి మహళి మాట్లాడుతూ.. ఖులా చెప్పి భర్త నుంచి విడాకులు పొందడం సరైన పద్ధతికాదని చెప్పారు. ఖులా ఇస్తున్నట్లు ముందుగా తన భర్తకు నోటీసు ఇవ్వాలని, ఇలాంటివి మూడు నోటీసులు పంపించిన తర్వాత స్పందించకపోతే విడాకులు ఇవ్వొచ్చని మౌలానా తెలిపారు. 

Advertisement

పోల్

Advertisement