‘కథువా’ లైంగిక దాడి నిజమే: వైద్యులు | molestation kathua case is true | Sakshi
Sakshi News home page

‘కథువా’ లైంగిక దాడి నిజమే: వైద్యులు

Sep 10 2018 4:58 AM | Updated on Sep 10 2018 4:58 AM

molestation kathua case is true - Sakshi

పఠాన్‌కోట్‌: ‘కథువా’ ఘటనలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యుల బృందం ధ్రువీకరించింది. బాధిత బాలిక ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్లు తేల్చింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ వివరాలను చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఇటీవల వివరించారని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జేకే చోప్రా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఓ బాలిక(8) సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.  బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిందనీ, ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement