పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పార్టీల ప్రచారం సోషల్ మీడియాలోనూ పెరిగింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పార్టీల ప్రచారం సోషల్ మీడియాలోనూ పెరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నాయి. సోషల్ మీడియాలో తమ నేతలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
సీఎం మమతా బెనర్జీ ఫేస్‌బుక్ పేజీకి 16 లక్షల మంది, ట్వీటర్‌కు 2.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై విజువల్ క్యాప్సుల్స్‌ను చానెళ్లలో, యూట్యూబ్‌లో పెట్టనున్నట్లు టీఎంసీ నాయకుడు బ్రీన్ తెలిపారు.