ప్రధాని నేతృత్వంలో నేడు ఎన్‌ఐసీ భేటీ | manmohan singh to focus on communal violence at NIC meet today | Sakshi
Sakshi News home page

ప్రధాని నేతృత్వంలో నేడు ఎన్‌ఐసీ భేటీ

Sep 22 2013 11:35 PM | Updated on Mar 9 2019 3:59 PM

ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని 148 మంది సభ్యులుగల జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సమావేశం సోమవారం ఢిల్లీలో జరగనుంది.

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని 148 మంది సభ్యులుగల జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సమావేశం సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో ముజఫర్‌నగర్ తరహా మత ఘర్షణల అణచివేత, మహిళల భద్రత అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. దేశంలో మత సామరస్యం పెంచేందుకు చర్యలు, ఈ దిశగా సామాజిక మీడియా బాధ్యత, మహిళల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సభ్యులు చర్చించ నున్నారు.

 

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభలలో విపక్ష నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరు కానున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్‌ఐసీ భేటీ రోజంతా కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement