కుక్కతో ఆడుతూ బంతిని మింగి.. | Man chokes to death after ball slips into mouth | Sakshi
Sakshi News home page

కుక్కతో ఆడుతూ బంతిని మింగి..

Jun 28 2015 8:04 PM | Updated on Sep 28 2018 3:41 PM

కుక్కతో ఆడుతూ బంతిని మింగి.. - Sakshi

కుక్కతో ఆడుతూ బంతిని మింగి..

కుక్కతో సరదాగా ఆడిన ఆట ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంతి నోట్లోకి ఇరుక్కుపోయి శ్వాస ఆడకపోవడంతో ఓ 27 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు.

కోల్ కతా: కుక్కతో సరదాగా ఆడిన ఆట ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంతి నోట్లోకి ఇరుక్కుపోయి శ్వాస ఆడకపోవడంతో ఓ 27 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన దక్షిణ కోల్ కతాలోని లేక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఆర్నేశ్ సింఘానియా వాళ్లింట్లోని పెంపుడు జంతువు స్కూబీ అనే కుక్కతో కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాడు.

అందులో భాగంగా 1.5 అంగుళాల బంతిని తీసుకొని రెండు దంతాల మధ్యలో కరిచిపట్టి కుక్క నోటికి అందించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త స్లిప్ అయిపోయి నేరుగా నోట్లోకి దూరిపోయి గొంతులోకి జారింది. ఆవెంటనే శ్వాసనాళానికి అడ్డుపడటంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement