పారగాన్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం | Major Fire Breaks out at Footwear Godown in Kochi | Sakshi
Sakshi News home page

పారగాన్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Feb 20 2019 1:11 PM | Updated on Feb 20 2019 1:58 PM

Major Fire Breaks out at Footwear Godown in Kochi - Sakshi

కొచ్చి : ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుదవారం ఉదయం అకస్మాత్తుగా సంస్థ గౌడోన్‌లో మంటలంటు కున్నాయి. ఐదు అంతస్తుల భవనమంతా వ్యాపించిన  అగ్ని కలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అలుముకుంది.  దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని పారగాన్ చెప్పుల బ్రాండ్‌ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

Advertisement
 
Advertisement
Advertisement