మృతదేహాలకు కరోనా పరీక్షలు బంద్‌

Maharashtra Stops Testing Bodies Of All Corona Suspects - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ అనుమానిత మృతదేహాలకు పరీక్షలు నిర్వహించటానికి సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపటానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ మృతుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఫిర్యాదులపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా అనుమానిత మృతదేహాలన్నింటికి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కాంటాక్ట్స్‌ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటూ మరణించి, కరోనా లక్షణాలు ఉన్న వారి మృతదేహాలకు మాత్రమే పరీక్షలు చేస్తామని తెలిపారు. వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి కూలర్‌ పెట్టారు )

కాగా, ల్యాబ్‌ రిపోర్టులు వచ్చేంత వరకు ఆగకుండా కరోనా వైరస్‌ అనుమానితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top