
సాక్షి, చెన్నై: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్‌రమణి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు శనివారం ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. తనను మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆమె చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజీయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తనన మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆగస్ట్ 28న సీజే రమణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను కోరారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీం తొసిపుచ్చింది.