రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ | LN Mishra murder case: Court convicts 3 Ananda Margas, lawyer | Sakshi
Sakshi News home page

రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ

Dec 9 2014 2:10 AM | Updated on Sep 2 2017 5:50 PM

రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ

రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ

నలభై ఏళ్ల క్రితం.. నాటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రాను హత్యచేసిన కేసులో ఢిల్లీకోర్టు నలుగురిని దోషులుగా నిర్ధారించింది.

న్యూఢిల్లీ: నలభై ఏళ్ల క్రితం.. నాటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రాను హత్యచేసిన కేసులో ఢిల్లీకోర్టు నలుగురిని దోషులుగా నిర్ధారించింది. దోషుల్లో ఆనంద మార్గ ఆధ్యాత్మిక కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సంతోషానంద అవధూత(75), సువేదానంద అవధూత (79), గోపాల్‌జీ (73)లతోపాటు న్యాయవాది రంజన్ ద్వివేది (66) ఉన్నారు. బెయిల్‌పై ఉన్న ద్వివేది ఢిల్లీల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా నిర్ధారిస్తూ జిల్లా జడ్జి వినోద్ గోయల్ సోమవారం తీర్పు ఇచ్చారు. శిక్షలను ఈనెల 15న ఖరారు చేయనున్నట్లు చెప్పారు.  1975 జనవరి 2న బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో నాటి రైల్వే మంత్రి మిశ్రాకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement