కరోనా సవాళ్లను కలిసి ఎదుర్కొందాం  | Lets Face The Corona Challenges Together Says Modi | Sakshi
Sakshi News home page

కరోనా సవాళ్లను కలిసి ఎదుర్కొందాం 

Apr 29 2020 1:47 AM | Updated on Apr 29 2020 1:47 AM

Lets Face The Corona Challenges Together Says Modi - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్‌ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవికి హామీ ఇచ్చారు. కరోనా ఉత్పాతంపై జొకోవితో చర్చించినట్టు నరేంద్రమోదీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement