హిట్ అండ్ రన్ కేసులో జానీ అరెస్ట్ | Kolkata hit-and-run: Third accused arrested | Sakshi
Sakshi News home page

హిట్ అండ్ రన్ కేసులో జానీ అరెస్ట్

Jan 19 2016 1:37 PM | Updated on Sep 3 2017 3:55 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా జానీ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోనూ అలియాస్ షహనాజ్ ను ఆదివారం రాత్రి ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబియా సోహ్రాబ్ ను శనివారం రాత్రి పట్టుకున్నారు. సోనూ, జానీలను కోర్టులో హాజరుపరిచామని, వారినీ తమ కస్టడీకి ఇవ్వాలని కోరినట్టు కోల్ కతా పోలీసు సంయుక్త కమిషనర్(కైమ్) దేబశిష్ బొరాల్  తెలిపారు.

సోహ్రాబ్ ను కోర్టు ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఈ నెల 13న సాంబియా, అతడి మిత్రులు ఆడీ కారుతో వైమానిక దళ అధికారి అభిమాన్యు గౌడ్(21) ఢీకొట్టి పారిపోయారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

పోల్

Advertisement