మోడీ దుర్యోధనుడా?
పాండవులూ సంఖ్యలో తక్కువే. కానీ పాండవులెప్పుడూ కౌరవులకు భయపడలేదు.' అన్నారు మల్లికార్జున్ ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుర్యోధనుడా? మంగళవారం లోకసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆ మాట అనలేదు కానీ అన్నంత పని చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ అర్థం వచ్చేలా చెప్పారు.
పార్లమెంటులో చర్చ జరుగుతూండగా లోకసభలో విపక్ష నేత మల్లికార్జన్ ఖర్గే 'లోకసభలో కాంగ్రెస్ సభ్యులు 44 మంది కావచ్చు. కానీ పాండవులూ సంఖ్యలో తక్కువే. కానీ పాండవులెప్పుడూ కౌరవులకు భయపడలేదు.' అన్నారు. కాంగ్రెస్ సంఖ్యా బలం గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాటన్నారు. బిజెపిని కౌరవసేనగా పోల్చారు ఆయన. అలా మోడీని దుర్యోధనుడని అనకుండా అనేశారు.