తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి | kethireddy goes for election campaign in hosur | Sakshi
Sakshi News home page

తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి

May 5 2016 7:45 PM | Updated on Sep 3 2017 11:28 PM

తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి

తెలుగుశక్తికి ఓట్లతో విముక్తి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమీద పోటీచేస్తున్న తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గురువారం నాడు హోసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమీద పోటీచేస్తున్న తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గురువారం నాడు హోసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ఎన్నికల గుర్తు అయిన ఆటోరిక్షాకు ఓటేయాలని హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని అభ్యర్థించారు.

'నిర్బంధపు చెరలో తెలుగుశక్తి.. మీ ఓటుతో దానికి విముక్తి' అనే నినాదంతో ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు. దశాబ్దాలుగా తమిళనాడులో తెలుగు ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మైనారిటీలుగా ఉన్న తమిళులు మెజారిటీ అయిన తెలుగు వారిపై పెత్తనం సాగించడం సహించరాని విషయమని చెప్పారు. హోసూరు ప్రాంతంలో ఉన్న తెలుగువారిని కలిసి.. తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement