జరిమానా చెల్లించిన గవర్నర్‌

Kerala Governor P Sathasivam Pay Fine For His Vehicle Over Speed - Sakshi

రాజ్యాంగ పదవిలో ఉన్న కూడా రవాణా శాఖ అధికారులు తన వాహనానికి విధించిన జరిమానా చెల్లించారు కేరళ గవర్నర్‌ పి సదాశివం. వివరాల్లోకి వెళితే.. సదాశివం అధికారిక వాహనం మెర్సిడెస్‌ బెంజ్‌ కారు 10 రోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించింది. కౌడియర్‌ రోడ్డులో 55 కి.మీ వేగ పరిమితి ఉండగా.. గవర్నర్‌ వాహనం  మాత్రం 80 కి.మీ వేగంతో దూసుకెళ్లింది.  ఆ సమయంలో కారులో గవర్నర్‌ లేకపోవడంతో డ్రైవర్‌ స్పీడ్‌గా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి స్పీడ్‌ డిటెక్టర్‌ సెన్సార్లలో కారు అధిక వేగంతో వెళ్లినట్టు రికార్డయింది.

దీంతో రవాణా శాఖ అధికారులు గవర్నర్‌ వాహనానికి 400 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్‌ వెంటనే ఆ ఫైన్‌ చెల్లించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. గవర్నర్‌ ఆదేశాలతో ఆయన సెక్రటరీ రవాణా శాఖ కార్యాలయంలో జరిమానా చెల్లించారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. తొలుత గవర్నర్‌ వాహనానికి ఫైన్‌ విధించే అంశంలో వెనుకడుగు వేసినప్పటికి.. నిబంధనల ప్రకారం నడుచుకున్నామని  తెలిపారు. గవర్నర్‌ చేసిన ఈ పని పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top