పాగా వేసిన కాషాయదళం | KASHMIR-GOVT PDP-BJP Govt formed in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

పాగా వేసిన కాషాయదళం

Mar 1 2015 12:54 PM | Updated on Sep 2 2017 10:08 PM

మొత్తానికి జమ్మూ కశ్మీర్ లో కాషాయ దళం పాగా వేసింది.

జమ్ము: మొత్తానికి జమ్మూ కశ్మీర్ లో కాషాయ దళం పాగా వేసింది. మొట్టమొదటిసారిగా కశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వామిగా అవతరించింది.   ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్  అయిన నిర్మల సింగ్ ను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. అలాగే కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపక్పలనలో  ప్రధాన సంధానకర్త  పీడీపీ  ఎమ్మెల్యే, హసీబ్  డబ్రూ కేబెనెట్ లో చోటు సంపాదించారు.  అంతేకాదు ఈ డీల్ లో కీలక పాత్ర నిర్వహించినందుకు ప్రధాని మోదీ అభినందనలూ,  ఆత్మీయ ఆలింగనాలూ అందుకు న్నారు హసీబ్.
 రాష్ట్రంలోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కడ మరో విశేషం.  బీజేపీకి చెందిన ప్రియా సేథి, పీడీపీకి  చెందిన ఆసియా నఖాశ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement