సాధువుల హ‌త్య‌కేసు; లాయ‌ర్ మృతి

Junior Lawyer In Palghar Mob Lynching Case Dies In Road Accident - Sakshi

ముంబై : పాల్గర్‌‌ జిల్లా మూకదాడి కేసులో హ‌త్య‌కు గురైన సాధువుల త‌ర‌పున వాదిస్తున్న జూనియ‌ర్ న్యాయ‌వాది దిగ్విజయ్ త్రివేది బుధవారం రోడ్డు ప్ర‌మ‌దంలో మ‌ర‌ణించారు. ఈ కేసు విష‌యమై కోర్టుకు వెళుతున్న ఆయ‌న ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో దిగ్విజ‌య్‌తో పాటు ఓ మ‌హిళ కూడా ఉంది. అయితే లాయ‌ర్ త్రివేది అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, తీవ్ర గాయాల‌తో ఆమెను ఆసుప‌త్రిలో చేర్చించారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య )

కారు ప్ర‌మాదంపై బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా అనుమ‌నాలు వ్య‌క్తం చేశారు. పాల్గర్‌ మూకదాడి కేసులో సాధువుల త‌రుపున వాదిస్తున్న లాయ‌ర్‌పై ఎవ‌రైనా కుట్ర ప‌న్ని ఈ ఘాతానికి తెగ బ‌డ్డారా లేక ఇది యాదృచ్ఛిక‌మా? అని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ఇది వ‌ర‌కే ఫాల్గ‌ర్ కేసును లేవ‌నెత్తిన వారిపై కొంద‌రు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు. అయితే ప్ర‌మాదంపై ఆర్టీఓ నుంచి నివేదిక వ‌చ్చాకే నిజ‌నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని పాల్గ‌ర్ కేసులో త్రివేదితో పాటు వాదిస్తున్న మ‌రో లాయ‌ర్ పిఎన్ ఓజా పేర్కొన్నారు.
(101 మంది అరెస్ట్‌.. ఒక్క ముస్లిం కూడా లేడు )

ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాలో ముగ్గురు సాధువులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాల్గార్‌ జిల్లాలోని దబాధి ఖన్వేల్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం మీదుగా కారులో సూరత్‌ వెళ్తున్న ముగ్గురు సాధువుల‌ను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో సాధువుల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చంపేసిన‌ట్లు బీజేపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 
(సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top