సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా

CoronaVirus: Palghar Mob Lynching Accused Tests Positive - Sakshi

మూకహత్య కేసులో అరెస్ట్‌ చేసిన వారిలో ఒకరికి కరోనా

అతడితో పాటు మరో 20 మంది అనుమానితులకు కరోనా టెస్టులు

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని  పాల్గాడ్‌ జిల్లాలో ఇద్దరు సాధవులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కల్పవృక్ష గిరిరాజ్‌(70), సుశీల్‌ గిరిరాజ్‌(35)లతో పాటు మరో డ్రైవర్‌ను ఓ గుంపు కర్రలతో, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో మహారాష్ట్ర క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) ఇప్పటికే వందమందిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో 15 మందిని కస్టడీలోకి తీసుకుని వాడా పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. 

అయితే నిందుతుల్లో ఒకరు అస్వస్థతకు గురవ్వడంతో పాల్గర్‌ రూరల్‌ అస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే అతడిని జేజే ఆస్పత్రిలోని ప్రత్యేక జైల్‌ వార్డ్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే వాడా పోలీస్‌స్టేషన్‌లో ఈ నిందుతుడితో పాటు మరో 20 మందిని పోలీసులు ఒకే గదిలో ఉంచారు. దీంతో ఆ గదిలో ఉన్న మిగతా 20 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సాధువులను హత్య చేసిన అనంతరం నిందితులు అడువుల్లోకి పారిపోయారు. అయితే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించి వారి జాడ కనిపెట్టారు. ఇక ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో 9 మంది మైనర్లు, ఇద్దరు సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి:
101 మంది అరెస్ట్‌.. ఒక్క ముస్లిం కూడా లేడు
ఠాక్రే ఎన్నికకు ముహూర్తం ఖరారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top