101 మంది అరెస్ట్‌.. ఒక్క ముస్లిం కూడా లేడు

Home Minister Anil Deshmukh Says No Muslim In Mob Incident At Palghar District - Sakshi

ముంబై: మహారాష్ట్రలో గతవారం పాల్గాడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి ఇప్పటివరకు 101మందిని అరెస్ట్‌ చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దినేష్‌ముఖ్‌ బుధవారం తెలిపారు. ఈ మూకహత్యను బీజేపీ నేతలు మతకల్లోలానికి చెందినదిగా ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. హత్యకేసులో భాగంగా అరెస్ట్‌చేసిన 101 మందిలో ఒక్కరు కూడా ముస్లిం కాదని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు ఈ మూకహత్యకు మతం రంగు పులమడం సరికాదన్నారు. (మూకహత్య: ఉద్ధవ్‌ ఠాక్రేకు అమిత్‌ షా ఫోన్‌)

ఇక భయంకరమైన కారోనా వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొంతమంది కరోనా వైరస్‌ విస్తరిస్తున్న ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.

పాల్గాడ్‌ జిల్లాలోని దబాధి ఖన్వేల్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్‌ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్‌ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్‌(35), వారి డ్రైవర్‌ నీలేశ్‌ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గ్రామస్తులు వారిపై కూడా దాడికి తెగపడ్డారు.  (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top