
జయలలిత కోసం నటి ఆత్మహత్యాయత్నం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను విడుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను విడుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జయకు జైలు శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ కోలీవుడ్ నటి మాయ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
బుధవారం మధ్యాహ్నం మాయ తన కుమార్తె గుణప్రియతో కలసి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆమె తన వెంట కిరోసిన్ క్యాన్ కూడా తీసుకువచ్చారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మాయను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. జయలలిత కోసం తాను, తన కుమార్తె ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నామని మాయ చెప్పారు. దివంగత ఎంజీఆర్ నటించిన 'అమరకావ్యం', రజనీకాంత్ సినిమా 'గర్జనాయ్'లలో మాయ నటించారు.