నెహ్రూ విగ్రహాన్ని తొలగించిన యోగి

Jawaharlal Statue Removed Near Anand Bhavan - Sakshi

లక్నో : ఆనంద్‌ భవన్‌ సమీపంలో ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు క్రేన్‌కు ఎదురుగా నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపించారు. దేశ ప్రథమ ప్రధానికిచ్చే కనీస మర్యాద ఇదేనా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంతేకాక యోగికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. సుందరీకరణ కోసం నెహ్రూ విగ్రహాన్నే మాత్రమే తొలగించారు, అదే వీధిలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. కానీ అధికారులు మాత్రం నెహ్రూ విగ్రహం తొలగింపు వెనక వేరే ఉద్దేశం లేదని తెలియజేశారు. వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళా ఏర్పాట్లలో భాగంగానే నెహ్రూ విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top