బీసీ విద్యార్థులకు అన్యాయం

Injustice To Backward Students In Medical Counselling - Sakshi

ఢిల్లీ: ఈ ఏడాది మెడికల్‌ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో 550 మంది, తెలంగాణలో 250 మంది నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు ఎన్నారై మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడులు కౌన్సెలింగ్‌లో అన్యాయం చేశారని మండిపడ్డారు. హడావుడిగా రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేశారని చెప్పారు. కౌన్సిలింగ్‌ హైకోర్టు తీర్పు ప్రకారం జరగడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు భారీగా నష్టపోయారని వెల్లడించారు.

జీవో 550 ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ..జీవో 550ని సుప్రీంకోర్టు సమర్ధించడం హర్షణీయమన్నారు. అయితే ఈ ఏడాది హైకోర్టు తీర్పు ప్రకారం జరిగిన కౌన్సెలింగ్‌లో తాము జోక్యం చేసుకోమని చెప్పడం వల్ల 500 మందికి పైగా విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేందుకు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. ఆధిపత్య కులాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాళోజీ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీ అధికారులు హడావిడిగా కౌన్సిలింగ్‌ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top