కీలక విషయం వెల్లడించిన సుష్మ | Infosys Techie Ganesan Was In Same Coach As Suicide Bomber | Sakshi
Sakshi News home page

కీలక విషయం వెల్లడించిన సుష్మ

Mar 29 2016 1:10 PM | Updated on Sep 3 2017 8:49 PM

రాఘవేంద్రన్ భార్య వైశాలి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన పెళ్లినాటి ఫొటో

రాఘవేంద్రన్ భార్య వైశాలి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన పెళ్లినాటి ఫొటో

రాఘవేంద్రన్ మరణవార్తను ట్విటర్ ద్వారా ప్రకటించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కీలక విషయం వెల్లడించారు.

న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ కుటుంబానికి సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు రాఘవేంద్రన్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ నెల 22న బ్రసెల్స్ లో ఉగ్రవాదుల సమయంలో గల్లంతైన రాఘవేంద్రన్ మృతి చెందినట్టు సోమవారం నిర్ధారించారు. బెంగళూరు ఇన్ఫోసిస్ కు చెందిన అతడు బ్రసెల్స్ మెట్రోరైళ్లో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు.

రాఘవేంద్రన్ మరణవార్తను ట్విటర్ ద్వారా ప్రకటించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కీలక విషయం వెల్లడించారు. ఆత్మాహుతి దళ సభ్యుడు తనకు తానుగా పేల్చేసుకున్న బోగీలోనే రాఘవేంద్రన్ ఉన్నాడన్న దిగ్భ్రాంతకర విషయాన్ని తెలిపారు. అతడి అవశేషాలను బ్రసెల్స్ లోని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. రాఘవేంద్రన్ కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాఘవేంద్రన్ ఉన్న బోగీలోనే మానవబాంబు ఉన్నాడన్న విషయం మంత్రి ప్రకటనతో స్పష్టమైంది.

కాగా, బ్రసెల్స్ లో పేలుళ్ల తర్వాత కనిపించకుండా పోయిన రాఘవేంద్రన్ ఆచూకీ కోసం అతని సోదరుడు చంద్రశేఖర్‌ గణేశన్ సోషల్ మీడియా ద్వారా విశ్వప్రయత్నం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా భారత ఉన్నతాధికారులను సంప్రదించాడు. ట్విటర్ లో సుష్మా స్వరాజ్ ను సంప్రదించాడు. చంద్రశేఖర్‌ ప్రయత్నానికి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు చేతనైన పద్ధతుల్లో సాయం అందించారు. బస్సెల్స్ లో ఉన్న ఆస్పత్రి వివరాలు అందించడంతో పాటు సూచనలు, సలహాలు అందించారు. అయితే రాఘవేంద్రన్ ప్రాణాలతో లేడన్న సమాచారంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు, నెటిజన్లు షాక్ కు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement