ఇదే ఏడాదిలో ఎన్‌ఎస్‌జీ మరో భేటీ! | India's Hope For Nuke Club Entry Alive, NSG To Meet Again This Year: Sources | Sakshi
Sakshi News home page

ఇదే ఏడాదిలో ఎన్‌ఎస్‌జీ మరో భేటీ!

Jun 27 2016 5:47 PM | Updated on Sep 4 2017 3:33 AM

ఎన్‌పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వంపై ఈ ఏడాదిలోనే మరోమారు భేటీ జరిగే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: ఎన్‌పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వంపై ఈ ఏడాదిలోనే మరోమారు భేటీ జరిగే అవకాశం ఉంది. గత గురు, శుక్రవారాల్లో సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ భారత్ సభ్యత్వంపై చైనా వ్యతిరేకతవల్ల నిర్ణయం లేకుండానే ముగియడం తెలిసిందే.

దీంతో భారత్ వాదనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, కూటమి మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉందని చైనాకు ఎన్‌ఎస్‌జీ చెప్పింది. భారత్ సభ్యత్వంపై అనధికార చర్చలు జరిపేందుకు అర్జెంటీనా రాయబారి రఫెల్ గ్రోస్సి నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను ఎన్‌ఎస్‌జీ ఏర్పాటు చేసింది.

సభ్యత్వంతో నష్టమే: యశ్వంత్
ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వంపై మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. సభ్యత్వంతో భారత్‌కు నష్టమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement