బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం | Indian girls win award for tricking traffickers and busting cross-border | Sakshi
Sakshi News home page

బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం

Jan 18 2017 4:04 AM | Updated on Sep 5 2017 1:26 AM

బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం

బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం

2017వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించారు.

జాతీయ సాహస పురస్కారాల ప్రకటన  
న్యూఢిల్లీ: 2017వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్‌ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు ఈ ఏడాదికి గీతా చోప్రా అవార్డును అందుకోనున్నారు. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లో పచిన్‌ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్‌ పీజుకు భారత్‌ అవార్డు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో తన సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన సుమిత్‌కు సంజయ్‌ చోప్రా పురస్కారం ప్రదానం చేయనున్నారు. మొత్తం 25 మంది పిల్లల(13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు. జనవరి 23న వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement