గజరాజు..అరటిపళ్లు ఓ వైరల్‌ వీడియో 

Indian Family Feeds Bananas to Elephant who Knocked The Door - Sakshi

ఆ గజరాజుకు ఆకలేసిందో ఏమో తెలియదు కానీ ..కేరళలోని ఇంటి తలుపు తట్టింది. అయితే ఏనుగును చూసిన ఆ కుటుంబం కూడా గజగజ వణికిపోకుండా  సానుకూలంగా స్పందించింది. ఇంట్లో ఉన్న అమ్మమ్మ , మనవరాలు  అరటి పళ్లను తీసుకొచ్చి..రాజావారికి ఆప్యాయంగా తినిపించారు.  దీంతో ఇంటి గడపలోంచే వాటిని మర్యాదగా ఆరగించింది ఏనుగు. అంతేకాదు  ఆత్మీయ అతిధిని సాగనంపినట్టూ..బై ..బై  ఏనుగుకు అంటూ వీడ్కోలు  పలికారు.  ఏనుగు తొండంతో మూతి తుడుచుకుంటూ.. మెల్లగా తన దారిన తాను వెళ్లిపోయింది.  సోషల్‌ మీడియాలో ఈ వీడియో చక్కర్లు  కొడుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top