ప్రైవేటు స్కూళ్ల ఆధిపత్యం నేపథ్యంలో.. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు కొత్త మార్గం ఎన్నుకున్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సురేశ్ అనే ఓ ప్రధానోపాధ్యాయుడు
కొత్తగా చేరిన విద్యార్థులకు రూ.వెయ్యి ఇస్తున్న హెచ్‌ఎం
కేకే.నగర్(చెన్నై): ప్రైవేటు స్కూళ్ల ఆధిపత్యం నేపథ్యంలో.. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు కొత్త మార్గం ఎన్నుకున్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సురేశ్ అనే ఓ ప్రధానోపాధ్యాయుడు. తన స్కూల్‌లో చేరే ప్రతి విద్యార్థికి రూ.వెయ్యి ఇస్తానని వేసవి సెలవుల్లో ఆయన ప్రకటించారు. అన ంతరం, ఈ నెల 1న పాఠశాల పునః ప్రారంభమవ్వడంతో కొత్తగా చేరిన 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున సొంత డబ్బులు చెల్లించి మాట నిలబెట్టుకున్నాడు.