రాహుల్‌ గాంధీకి ఆరెస్సెస్‌ ఆహ్వానం | If Rahul Gandhi Reads Gita, He Will Want To Join Us: RSS Leader | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీకి ఆరెస్సెస్‌ ఆహ్వానం

Jun 8 2017 6:58 PM | Updated on Sep 5 2017 1:07 PM

రాహుల్‌ గాంధీకి ఆరెస్సెస్‌ ఆహ్వానం

రాహుల్‌ గాంధీకి ఆరెస్సెస్‌ ఆహ్వానం

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భగవద్గీత చదివితే ఆయన కూడా ఆరెస్సెస్‌లో చేరుతారని ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భగవద్గీత చదివితే ఆయన కూడా ఆరెస్సెస్‌లో చేరాలని ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ అరెస్సెస్‌ నిర్వహించే కార్యక్రమాలకు రాహుల్‌ గాంధీ హాజరవ్వాలని ఆయన ఆహ్వానం పలికారు. అప్పుడైనా ఆయనకు భారత్‌ అంటే ఏమిటో అర్ధమవుతుందని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

గత వారం రాహుల్‌గాంధీ చెన్నైలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు చదువుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంద్రేష్‌ కుమార్‌ ‘రాహుల్‌గాంధీ గీతా, పురాణాలు చదివితే ఆయన భవిష్యత్తులో ఆరెస్సెస్‌లో చేరాలనికోరుకుంటారు’ అంటూ ఆయన హాస్యమాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement