మద్యం తయారీ.. ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌

How To Make Alcohol At Home Top Online Searches - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం ప్రియులు అల్లాడుతున్నారు. ఆల్కహాల్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం మద్యం సేవించేవారు లాక్‌డౌన్‌ కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యకు సైతం పాల్పడుతుండగా.. మరికొందరు మానసికంగా కుంగుబాటుకు గురవ్వుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధికారుల కళ్లు కప్పి.. అధిక ధరలకు మద్యంను విక్రయిస్తున్నారు. దీంతో రూ. 700 విలువ చేసే మద్యం బాటిల్స్‌ను ఏకంగా రూ.3వేలు పెట్టిమరీ కొనుగోలు చేస్తున్నారు. అంతగా ఆర్థిక స్తోమత లేనికొందరు ఏకంగా వైన్‌షాపులకే కన్నాలు వేస్తున్నారు. (ఇలా కూడా మద్యం తాగొచ్చు)

 ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది మందుబాబులకు మాత్రం ఆల్కహాల్ దొరకడం లేదు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఇంట్లోనే స్వయంగా ఆల్కహాల్‌ తయారీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం ఇంటర్‌నెట్‌కి పనిచెప్పారు. ‘ఇంట్లోనే స్వతహాగా ఆల్కహాల్‌ తయారు చేయడం ఎలా’ అని మద్యం ప్రియులు గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చ్‌ చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించిప్పటి నుంచి గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన వాటిల్లో ఇది కూడా ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. మార్చి 22-28 మధ్య ఈ టాపిక్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top