ఇద్దరిని బలితీసుకున్న పబ్జీ గేమ్‌ | Hingoli two youth died due to pubji game | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలితీసుకున్న పబ్జీ గేమ్‌

Mar 18 2019 5:54 AM | Updated on Mar 18 2019 5:54 AM

Hingoli two youth died due to pubji game - Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌ పబ్జీ పిచ్చి మహారాష్ట్రలో ఇద్దరు యువకులను బలితీసుకుంది. హింగోలి ప్రాంతంలో నాగేశ్‌ గోరే (22), స్వన్నిల్‌ అన్నపూర్ణ (24) అనే ఇద్దరు ఈ ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొంది. శనివారం సాయంత్రం ఖటకాళీ బైపాస్‌ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరకు వీరిద్దరూ మోటర్‌ సైకిల్‌పై వచ్చారు. ట్రాక్‌ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడసాగారు. ఆటలో నిమగ్నమైన వీరు అజ్మీర్‌–హైదరాబాద్‌ రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదు. రైలు డ్రైవర్‌ హార్న్‌ కొట్టినా పట్టించుకోలేదు. దీంతో వేగంగా దూసుకొచ్చిన రైలు ఇద్దరినీ ఢీ కొంది. అక్కడికక్కడే వారు మరణించారు. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement