మృతుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం | himachal government announces 1.5 lakh compensation to deceased students' families | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం

Jun 10 2014 12:52 PM | Updated on Sep 2 2017 8:35 AM

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. బియాస్ నదీ ప్రమాదంలో దాదాపు 24 మంది తెలుగు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.

వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీతో కూడిన బృందం కులు మనాలికి విహారయాత్ర కోసం వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గల్లంతైన వారి ఆచూకీ కోసం దాదాపు 550 మంది పారామిలటరీ బలగాలు అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement