గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ దోషులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందికి.... శిక్షను ప్రత్యేక విచారణ కోర్టు విధించింది.
గుజరాత్: గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ దోషులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందికి.... శిక్షను ప్రత్యేక విచారణ కోర్టు విధించింది. 24 మంది దోషుల్లో 11మందిపై హత్యా నేరం ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసులో 36మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. గుల్బర్గా సొసైటీ హత్యాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహెసాన్ జాఫరి సహా 69మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.
తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. అయితే ఈ కేసు నుంచి మోదీకి ఊరట లభించింది.