వివాదాల వలలో హర్షవర్ధన్ | Sakshi
Sakshi News home page

వివాదాల వలలో హర్షవర్ధన్

Published Fri, Jun 27 2014 11:23 PM

వివాదాల వలలో హర్షవర్ధన్ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ ప్రచారంలో కండోమ్స్ వినియోగంపై కంటే భార్యాభర్తలు నిబద్ధతతో కూడిన లైంగిక సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలంటూ ఆయన ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యైలపె రేగిన వివాదం సద్దుమణగకముందే పాఠశాలలో లైంగిక విద్యను నిషేధించాలని ఆయన వెబ్‌సైట్ లోవెల్లడించిన అభిప్రాయం సరికొత్త వివాదాన్ని సృష్టించింది.
 
ఢిల్లీ పాఠశాలలకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ విజ న్ డాక్యుమెంట్‌లో ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ స్కూళ్లలో ప్రస్తుతం బోధిస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధిస్తామని, యోగాను తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని, భారతీయ సంస్కృతిని గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వ్యాఖ్యలను  కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మహిళా సంస్థ లు, సామాజిక కార్యకర్తలు దీనిని వ్యతిరేకించారు. అయితే హర్షవర్ధన్ తాను సెక్స్ ఎడ్యుకేషన్ నిషేధించాలని అనలేదంటూ వివరణ  ఇచ్చారు.   

అంత కు ముందు ఆయన న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై నియంత్రణ కోసం  కండోమ్స్ వాడకాని కన్నా భార్యాభర్తల మధ్య నిబద్ధతతో కూడిన  శారీరక సంబంధాలను ప్రోత్సహించాలనేది  తన అభిప్రాయమని, ఇది భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా  శాస్త్రీయమైన నివారణ మార్గమని  పేర్కొన్నారు. కండోం లతో సురక్షితమైన సెక్స్  జరుపుతున్నామన్న నమ్మ కం కలిగిస్తాయని, అన్నిటికంటే సురక్షితమైన సెక్స్ భార్యాభర్తల మధ్య నిబద్ధదత తో కూడిన లైంగిక సంబంధం అవసరమని ఆయన పేర్కొన్నారు.

 హర్షవర్ధన్ వెలిబుచ్చిన  అభిప్రాయంపై  పలు ఎన్జీఓలు,  ఆరోగ్య కారకర్తలు  గగ్గోలు పెట్టారు. ‘హెచ్‌ఐవీ,  ఎయిడ్స్ నియంత్రణ ప్రచార ఉద్యమం కండోమ్స్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించకూడదు. కండోమ్ వాడుతున్నంతవరకు  ఎటువంటి అక్రమ లైంగిక సంబంధం కలిగిఉన్నా ఫర్వాలేదనే తప్పుడు సందేశాన్ని ఇది అందిస్తుంది.   లైంగిక సంబంధాలలో భార్యభర్తలు ఒకరికి కట్టుబడి ఉండాలి’ అనే తన  వ్యాఖ్యైలపె హర్షవర్ధన్ వివరణ ఇస్తూ కండోమ్స్ పగిలిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల లైంగిక సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement