హార్దిక్‌కు రెండేళ్ల జైలు

Hardik Patel sentenced to 2 years in jail - Sakshi

విస్‌నగర్‌ ర్యాలీలో జరిగిన హింస కేసులో ఖరారు

రూ. 50 వేల జరిమానా

మెహసానా: పటీదార్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్‌ పటేల్‌కు గుజరాత్‌లోని ఓ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 జూలైలో విస్‌నగర్‌లో జరిగిన అల్లర్లు, ఆస్తి నష్టం కేసులో హార్దిక్‌తో పాటు లాల్‌జీ పటేల్, ఏకే పటేల్‌కు శిక్ష పడింది. అయితే వెంటనే అదేకోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. అల్లర్లు సృష్టించడం, ఆస్తి నష్టం, చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడం వంటి కేసుల్లో వారు ముగ్గురూ దోషులుగా తేలినట్లు విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్‌ తీర్పులో పేర్కొన్నారు.

వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 14 మందిని సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. పటీదార్‌ రిజర్వేషన్ల కోసం విస్‌నగర్‌లో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారిందని, దీనివల్ల ఆస్తి నష్టం, మీడియాపై దాడులు జరిగాయని మెహసానా జిల్లాలో 2015 జూలై 23న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సత్యం, రైతులు, యువత, పేదవారి కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని బెదిరింపులతో బీజేపీ ‘హిట్లర్‌ షాహీ’ ఆపలేరని హార్దిక్‌ పటేల్‌ మీడియాతో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top