ఆ సీడీకి అంత సీన్‌ లేదు

hardhik patel fires on sex cd - Sakshi

సాక్షి,అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటేళ్ల ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ మద్యం సేవిస్తూ మగువతో సన్నిహితంగా ఉన్న మరికొన్ని వీడియో క్లిప్స్‌ బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. సెక్స్‌ సీడీ ప్రకంపనలు ముగియకముందే తాజా వీడియోలు బహిర్గతం కావడం బీజేపీ కుట్రలో భాగమేనని హార్థిక్‌ పటేల్‌ ఆయన సన్నిహిత నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ తొలినుంచి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలో ఆరితేరిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

మరోవైపు సెక్స్‌ సీడీ, తాజా వీడియోలు పటేళ్ల ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపబోవని పటేల్‌ ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. బీజేపీ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం దారుణమని హార్థిక్‌ పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో బీజేపీ 22 ఏళ్ల వైఫల్యాలను ఎత్తిచూపడంతో 23 ఏళ్ల యువకుడిని వారు టార్గెట్‌ చేశారని ఆరోపించారు. సెక్స్‌ సీడీని తెరపైకి తెచ్చినవారిపై త్వరలో ఫిర్యాదు చేస్తానని, దీనిపై తన న్యాయవాదులతో సంప్రదిస్తున్నానని హార్థిక్‌ పటేల్‌ చెప్పారు.

నేతల వ్యక్తిత్వంపై బీజేపీ సాగిస్తున్న దాడి పటేళ్ల ఉద్యమంపై ప్రతికూలంగా ఉండదని, కోటా డిమాండ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక హార్థిక్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పూర్తిగా సమర్ధించింది. బీజేపీ చవకబారు రాజకీయాలకు పాల్పడుతోందని, హార్థిక్‌ పటేల్‌ వ్యక్తిగత విషయాన్ని భూతద్దంలో చూపుతోందని గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ భరత్‌ సింహ్‌ సోలంకి విమర్శించారు. ఏ పార్టీ నేతనైనా ఈ రకంగా వేధించడం సమర్ధనీయం కాదని గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top