ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చిన్ని సైనికుడిలా.. 

Hardik Patel Set For BJP Entry With A Tweet - Sakshi

గుజరాత్‌ యువ ఉద్యమనేత, కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌ హర్ధిక్‌ పటేల్‌.. బీజేపీలో చేరే అంశంపై అధికారికంగా స్పందించాడు. ఈ మేరకు బీజేపీలో చేరుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం ఉదయం ఒక ట్వీట్‌ చేశాడు.

దేశప్రయోజనం, రాష్ట్రప్రయోజనం, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.. దేశానికి సేవ చేసే గొప్ప పనిలో నేను చిన్న సైనికుడిలా పని చేస్తాను అంటూ హిందీలో ఓ ట్వీట్‌ చేశాడు హర్ధిక్‌ పటేల్‌. 

బీజేపీలో చేరే ముందు హర్ధిక్‌ పటేల్‌ పూజాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. పాటీదార్‌ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన 28 ఏళ్ల ఈ యువనేత.. 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం, కాంగ్రెస్‌ అధిష్టానం పటేల్‌కు గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను అప్పగించింది. దీంతో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని భావించిన పటేల్‌కు అనుహ్యంగా పార్టీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, పార్టీ పెద్దల నుంచి సహాకారం అందకపోవడంతో పటేల్‌.. అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. 

ఇది కూడా చదవండి: 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో సినిమా చూశా!.. భార్యతో అమిత్‌ షా సరదా వ్యాఖ్య

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top