'వివాదాలకు తావులేకుండా సేవలందించండి' | Governor Narasimhan meets president Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

'వివాదాలకు తావులేకుండా సేవలందించండి'

May 30 2014 2:22 PM | Updated on Aug 24 2018 2:01 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శుక్రవారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు.

న్యూఢిల్లీ : గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ గవర్నర్గా నియమితులైన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. నరసింహన్ ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియ నివేదికను రాష్ట్రపతికి అందచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు, ఇరు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా వివాదాలకు తావులేకుండా ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందించాలని ప్రణబ్ ముఖర్జీ..గవర్నర్కు సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జూన్‌ 2  ఉదయం 6.30 గంటలకు  హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చేతుల మీదుగా గవర్నర్‌ నరసింహన్  ప్రమాణం చేస్తారు. తెలంగాణ గవర్నర్గా ఆయన అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా పని చేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement