'ముండే బిజెపి వదలాలనుకున్నారా?'
ఇటీవలే ప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే బిజెపిని వదలాలని అనుకున్నారని ఆయనకు సన్నిహితుడైన ఎం ఎల్ సీ ఒకరు బాంబుపేల్చారు.
ఇటీవలే ప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే బిజెపిని వదలాలని అనుకున్నారని ఆయనకు సన్నిహితుడైన ఎం ఎల్ సీ ఒకరు బాంబుపేల్చారు. ముండే మరణం కూడా అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం బిజెపిని ఇరకాటంలో పారేసింది.
మహారాష్ట్ర శానస మండలిలో గోపీనాథ్ ముండేకి శ్రద్ధాంజలి అర్పించే తీర్మానంపై జరిగిన చర్చలో ముండే వీరాభిమాని, ఎంఎల్ సీ పాండురంగ్ ఫుండ్ కర్ మాట్లాడుతూ పార్టీలో ముండే ఎన్నో ఇబ్బందులను ఎన్నుకున్నారని, ఆయన పార్టీని కూడా వదలాలనుకున్నారని అన్నారు. ఆయనకు కాంగ్రెస్ మంత్రిపదవులను ఇస్తామని చెప్పింది కూడా. అయితే ఆయన పార్టీనే నమ్ముకుని పనిచేశారని అన్నారు.
ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఫుండ్ కర్ వ్యాఖ్యలపై పార్టీలో ఎవరూ స్పందించలేదు.