నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ | gk vasan new party to launch on november 28th | Sakshi
Sakshi News home page

నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ

Nov 11 2014 2:04 PM | Updated on Sep 2 2017 4:16 PM

నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ

నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ

కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది.

తమిళనాడు:కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 28వ తేదీన కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వాసన్ తాజాగా స్పష్టం చేశాడు. రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో బహిరంగ సభలోనే పార్టీ ఏర్పాటును వాసన్ ప్రకటిస్తారు. ఈ మధ్యనే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పిన వాసన్.. కొత్త పార్టీ పేరు.. అజెండాను అదే రోజు వెల్లడించనున్నారు.

 

తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జీకే వాసన్‌ కొత్తపార్టీకి విజయ్ కాంత్ మద్దతిచ్చే క్రమంలోనే ఆ కార్యక్రమానికి డీఎండీకే శ్రేణులు హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement