చిచ్చరపిడుగు మోగ్లీ.. విన్యాసాలు | Girl Climbing Coconut Tree Without Any Harness | Sakshi
Sakshi News home page

చిన్నారి మోగ్లీ.. విన్యాసాలు

Apr 4 2018 3:23 PM | Updated on Apr 4 2018 4:43 PM

Girl Climbing Coconut Tree Without Any Harness - Sakshi

తిరువనంతపురం : వేసవి కాలం వస్తోందంటే అందరూ హడలెత్తిపోతారు.. కానీ చిన్న పిల్లలు మాత్రం పండగ చేసుకుంటారు. ఎందుకంటే అపుడే కదా వారికి సెలవులు వచ్చేది. అప్పటివరకూ బడిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు వేసవి సెలవుల్లో తమ చేష్టలతో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. అటువంటి చిచ్చర పిడుగుల అల్లరికి అంతే ఉండదు. ‘నోస్టాలిగా’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో కేరళకు చెందిన ఓ చిన్నారి భయం లేకుండా కొమ్మను పట్టుకుని కొబ్బరి చెట్టెక్కేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తి.. ‘రానున్న రెండు నెలల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో దేవుడా’ అంటూ చేసిన కామెంట్‌ లైక్‌లు, షేర్లతో దూసుకుపోతోంది. అయితే ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరి నవ్వు తెప్పిచ్చినా.. జాగ్రత్త వహించకపోతే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడం మర్చిపోకండి సుమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement