దేశానికి మెడల్స్‌ సాధిస్తానని ముందే ఊహించారు

Gagan Narang Tell Emotional Post For His Father On Father's Day - Sakshi

న్యూ ఢిల్లీ:  ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ప్రఖ్యాత షూటర్‌, ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన గగన్‌ నారంగ్‌ తన తండ్రి గొప్పతనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. షూటింగ్‌లో బాడా ఆడి దేశానికి గొప్ప పాత్రినిథ్యం వహించి పలు జాతీయ, అంర్జాతీయ పతకాలు సాధించాలని తన తండ్రి ఆకాంక్షించారని తెలిపారు. 20 ఏళ్ల క్రితం సొంతింటిని అమ్మి తనకు షూటింగ్‌ ప్రాక్టిసుకు ఇబ్బంది కలగకూడదని ‘రైఫిల్‌’  కొనిచ్చారని గుర్తుచేసుకున్నాడు. ‘ఏదో రోజు నేను భారతదేశానికి గొప్ప మెడల్స్‌ సాధిస్తాననే నమ్మకం నాన్నకు ఉండేది. అందుకే నా కోసం సొంతింటిని అమ్మి.. రైఫిల్‌ను కొనిచ్చారు’ అని ఆయన  భావోద్వేగంగా పేర్కొన్నారు.

‘షూటింగ్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పుతానని,  ఒలింపిక్‌ క్రీడల్లో పతకం సాధిస్తానని నేను ఏనాడూ ఊహించలేదు. కానీ ఓ తండ్రిగా మా నాన్న నా ప్రతిభ మీద అపార నమ్మకం కలిగి ఉండేవారు’ అని తెలిపారు. ‘నా విజయాల వెనుక మా నాన్న సహకారం ఎంతో ఉంది. తండ్రిగా నా ప్రతిభను తెలుసుకోవడంతోపాటు, నా ముఖంలో సంతోషాన్ని నింపాలని తాపత్రయ పడిన గొప్పతండ్రి ఆయన.. హ్యాపి ఫాదర్స్‌ డే నాన్న’ అని పోస్ట్‌ చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top