సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు | free busses from chennai to hometowns | Sakshi
Sakshi News home page

సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు

Dec 5 2015 10:12 AM | Updated on Sep 3 2017 1:33 PM

సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు

సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు

భారీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది

చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. చెన్నై నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. అదేవిధంగా నగరంలో నాలుగురోజులపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మరోవైపు ఐటీ కంపెనీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఐటీ దిగ్గజం విప్రో చెన్నై నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వంద బస్సులను రంగంలోకి దింపింది. కోయంబెడు బస్టాప్‌ నుంచి ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య వంద బస్సుల్లో ఉచితంగా ప్రజలను తరలించేందుకు విప్రో ఏర్పాట్లు చేసింది.

మరోవైపు చెన్న విమానాశ్రయంలో పాక్షిక విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి టెక్నికల్ విమానాలు వెళ్లేందుకు వీలు కల్పించారు. పూర్తిస్థాయిలో వాణిజ్య విమానాలు నడిపేందుకు మరో రెండురోజుల సమయం పడుతుందని కేంద్రమంత్రి మహేశ్ శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement