హత్యకేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు | former UP minister DP Yadav sentenced to life in 1992 Mahendra Bhati murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు

Mar 10 2015 3:24 PM | Updated on Sep 2 2017 10:36 PM

ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి డీపీ యాదవ్ కు డెహ్రాడూన్ సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.

డెహ్రాడూన్:  ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి డీపీ యాదవ్ కు  డెహ్రాడూన్ సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.  1992 సెప్టెంబర్ లో మహేంద్ర సింగ్  భట్టి, అతని స్నేహితుడు  ఉదయ్ ప్రకాష్ ఆర్య దారుణంగా హత్యకు గురయ్యారు. 

ఈ నేపథ్యంలో డీపీ యాదవ్, కరణ్  యాదవ్, ప్రనీ భట్టిలపై వివిధ సెక్షన్ల  కింద క్రిమినల్  కేసులు  నమోదయ్యాయి. ఈకేసులో సీబీఐ కోర్టు జడ్జ్ అమిత్ కుమార్ సిరోహి.. డీపీ యాదవ్ సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

 

Advertisement

పోల్

Advertisement