మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత | former chief justice sh kapadia passes away | Sakshi
Sakshi News home page

మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత

Jan 5 2016 11:41 AM | Updated on Sep 3 2017 3:08 PM

మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత

మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా మంచి సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ఉండేవారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ కపాడియా చీఫ్ జస్టిస్ అయ్యారు.

వోడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు లాంటివి జస్టిస్ కపాడియా హయాంలోనే వెలువడ్డాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక నిరుపేద పార్సీ కుటుంబంలో పుట్టిన కపాడియా.. స్వయంకృషితోనే ప్రధాన న్యాయమూర్తి స్థాయి వరకు ఎదిగారు. 2012 సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఎలాంటి కమిటీలలో లేరు, ఇతర పదవులు చేపట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement