ఇంటి దేవుడి సేవలో జస్టిస్‌ వెంకటాచలయ్య | justice venkatachalaiah in manempalli | Sakshi
Sakshi News home page

ఇంటి దేవుడి సేవలో జస్టిస్‌ వెంకటాచలయ్య

Nov 20 2016 10:45 PM | Updated on Sep 4 2017 8:38 PM

ఇంటి దేవుడి సేవలో జస్టిస్‌ వెంకటాచలయ్య

ఇంటి దేవుడి సేవలో జస్టిస్‌ వెంకటాచలయ్య

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మానేంపల్లి వెంకటాచలయ్య వారి ఇంటి దైవమైన కోడి రంగనాథస్వామికి విశేష పూజలు నిర్వహించారు.

లేపాక్షి : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మానేంపల్లి వెంకటాచలయ్య వారి ఇంటి దైవమైన కోడి రంగనాథస్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆయన మండలంలోని శిరివరం గ్రామంలో వెలసిన కోడిరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వగ్రామమైన మానేంపల్లికి వచ్చినపుడల్లా స్వామిని దర్శించుకునే వెళ్తారు. ఆలయం వద్దకు వచ్చిన ఆయనకు మానేంపల్లి, శిరివరం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన కోడి రంగనాథ స్వామి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రూరల్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు, డిప్యూటీ తహశీల్దార్‌ సైఫుల్లాహక్‌, మానేంపల్లికి చెందిన వెంకటాచలపతి (చెలిస్వామి), శంకరప్ప, సంజీవప్ప, రఘునాథరెడ్డి, శిరివరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేష్, మంజునాథ్, డీలరు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement