
'మాకు న్యాయం జరగలేదు.. నేరం గెలిచింది'
నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదలను ఆపలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో బాధితురాలి తల్లి ఆశా సింగ్ నిరాశ వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదలను ఆపలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో బాధితురాలి తల్లి ఆశా సింగ్ నిరాశ వ్యక్తం చేసింది. నేరం గెలిచిందని, తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల తప్పుడు సందేశం వెళ్తుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పింది.
బాలనేరస్తుడి విడుదల నిలుపుదలపై స్టే ఇవ్వడానికి శుక్రవారం ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో బాలనేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు తీర్పు అనంతరం నిర్భయ కేసులో తమకు న్యాయం జరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మేల్కోవాలని, ఎప్పుడూ తమవంటి పేద ప్రజలే గాయపడుతున్నారని చెప్పారు.