వైరల్‌: ప్రకృతి ఒడిలో గజ రాజుల జలకాలు

Elephants Enjoying Evening Bath Video Goes Viral - Sakshi

పచ్చని ప్రకృతి మధ్య నదిలో సరాదాగా గడిపితే వచ్చే ఆ కిక్కే వేరు. ఇరుకైన బాతురూమ్‌లో మితమైన నీటితో స్నానం చేయడం కంటే సెలయేటిలో, జాలువారుతున్న జలపాతంలో చేస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఇది జంతువులకు పుట్టుకతో ఉన్న అదృష్టం. అలా ఓ గుంపులగా కదిలిన ఏనుగుల సైన్యం దారి మధ్యలో ఉన్న నదిలో జలకాలు ఆడాయి.  ఏనుగు కుటుంబం నీటిలో అటు ఇటు తిరుగుతూ వాటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఆనందంగా గడిపాయి. ఈ  దృశ్యాలను భారత అటవీశాఖ అధికారి పర్వీన్‌ కశ్యప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి)

‘ఏనుగుల కుటుంబం సాయత్రం స్నానం చేస్తుంది. పరిశుభ్రంగా ఎలా ఉండాలో వీటిని చూసిన నేర్చుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో తరుచూ దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. వైరస్‌ నుంచి రక్షించుకోడం కోసం భైతిక దూరం, పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో గజ రాజులు శుభ్రత పాటిస్తూ స్నానం చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. ‘మనుషుల కంటే జంతువులే మంచివి. జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనకు సరైన మార్గంలో నడిపే విషయాలను బోధిస్తాయి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక వీడియో షేర్‌ చేసిన కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. (భయానకం: తెలివిగా తప్పించుకున్నాడు)

ఈశ్వర్‌, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top