ఢిల్లీలో దొంగల బీభత్సం | Elderly couple killed in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దొంగల బీభత్సం

Nov 13 2015 3:45 PM | Updated on Aug 30 2018 5:27 PM

దేశరాజధాని నగరం ఢిల్లీలో వృద్ధ దంపతుల దారుణ హత్య కలకలం సృష్టించింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వృద్ధ దంపతుల దారుణ హత్య కలకలం సృష్టించింది.   కొడుకుతో కలిసి దీపావళి సంబరాల కోసం వచ్చిన మనోహర్ లాల్ మదన్ (86),  ఆయన భార్య విమల(80) ను  గుర్తు తెలియని దుండగులు గొంతు నులిమి హత్య  చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఈస్ట్  కైలాస్ రెసిడెన్సీలో  వీరి మృతదేహాలను   శుక్రవారం ఉదయం  పోలీసులు కనుగొన్నారు.  దొంగతనానికి వచ్చిన వారే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.   

ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి వుండటం, మృతదేహాలను పరిశీలించిన పోలీసులు  ఇది దొంగల పనేనని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.  గురువారం  అర్థరాత్రే   ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వారు అంచనావేస్తున్నారు. 

బీరువాలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని  పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఎంత సొమ్ము  చోరీకి గురైందని ఇంకా అంచనాకు రాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, దర్యాప్తు  కొనసాగుతుందన్నారు. కాగా   మనోహర్ లాల్ మదన్ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.
 

Advertisement
 
Advertisement
Advertisement