అంబేద్కర్ మనవడిపై దాడి | Dr Ambedkar's grandson attacked, escapes unhurt | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ మనవడిపై దాడి

Jun 16 2015 4:19 PM | Updated on Sep 3 2017 3:50 AM

డా.బీఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లికన్ సేనా అధ్యక్షుడు ఆనంద్ రాజ్ అంబేద్కర్ పై మంగళవారం దాడి జరిగింది.

రాయ్ గడ్(మహారాష్ట్ర): డా.బీఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లికన్ సేనా అధ్యక్షుడు ఆనంద్ రాజ్ అంబేద్కర్ పై మంగళవారం దాడి జరిగింది. కొంతమంది  రాజకీయ ఉద్యమ కారులు రాయ్ గడ్ జిల్లాలోని మహాద్ లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీ ఆవరణలో ఆనంద రాజ్ అంబేద్కర్ పై దాడికి పాల్పడ్డారు.

 

అయితే ఈ దాడిలో పార్టీ కార్యకర్తలు ఆనంద్ రాజ్ కు రక్షణ వలయంగా నిలవడంతో ఎటువంటి హాని జరుగలేదని పార్టీ జనరల్ సెక్రటరీ వాసంత్ కాంబ్లీ తెలిపారు.  కాగా, ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆనందరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ తో సమావేశం కావడానికి వెళ్లిన సమయంలో కొంతమంది కర్రలు, రాడ్ లు, ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు వాసంత్ తెలిపారు.  స్థానిక శివసేన ఉద్యమకారులే తమపై దాడికి  దిగినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement