డీఎంకే దిగ్గజనేత కన్నుమూత | DMK General Secretary K Anbazhagan Passes Away | Sakshi
Sakshi News home page

డీఎంకే ప్రధాన కార్యదర్శి కన్నుమూత

Mar 7 2020 8:20 AM | Updated on Mar 7 2020 8:41 AM

DMK General Secretary K Anbazhagan Passes Away - Sakshi

మొత్తం  తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికై రాష్ట్రానికి సేవలందించారు.

సాక్షి, చెన్నై : డీఎంకే సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌(97) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  ఈ మేరకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. అన్బళగన్‌ దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాదురైకి అత్యంత సిన్నిహితులు.  1944-1957 వరకు పచయప్ప కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

1957లో తొలిసారిగా తమిళనాడు శాసన సభకు ఎన్నికయ్యారు. మొత్తం  తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికై రాష్ట్రానికి సేవలందించారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. అన్నాదురై, కరుణానిధి ప్రభుత్వంలో విద్య, సాంఘీక సంక్షేమం, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. గతంలో లెక్చరర్‌గా పనిచేసినందువల్ల అంతా ఆయన్ను పెరాసిరియార్(ప్రొఫెసర్) అని పిలిచేవారు. అన్బళగన్ మరణం పార్టీ శ్రేణుల్లో విషాదం నింపింది.అన్బళగన్‌ మరణవార్త తెలియగానే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ అపోలో ఆస్పత్రికి చేరుకొని అంజలి ఘటించారు. అనంతరం అన్బళగన్‌ భౌతికకాయాన్ని చెన్నైలోని కిల్‌పాకంలో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement