ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌వాసి ఎం.దేవరాజారెడ్డి ఎన్నికయ్యారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌వాసి ఎం.దేవరాజారెడ్డి ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఆయన గతేడాది ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అధ్యక్షుడిగా ఏడాది పాటు కొనసాగుతారు. సీఏ విద్యా ప్రణాళికలో మార్పులు తేనున్నట్టు ఈ సందర్భంగా ఆయన మీడియాకు చెప్పారు. కొత్త సిలబస్ రావడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
‘‘విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించడం వల్ల సీరియస్ విద్యార్థులు మాత్రమే కోర్సు ఎంచుకునే అవకాశముంటుంది. సీఏలుగా దేశవిదేశాల్లో పని చేసేందుకు అవకాశాలు విరివిగా ఉన్నాయి. కొత్త కంపెనీ లా ప్రకారం సీఏలకు ఎన్నో బాధ్యతలు వచ్చాయి. దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు సీఏ వెన్నెముకగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు భవిష్యత్తుంది’’ అని పేర్కొన్నారు.